22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు

21-12-2025 12:45 PM

పాల్గొని ధ్యానం చేసిన అయ్యప్ప మాలదారులు

చిట్యాల,(విజయక్రాంతి):  ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో  అయ్యప్ప మాలదారులు ఆదివారం ధ్యాన వేడుకలలో పాల్గొన్నారు.  ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ జీటీవీలో ప్రత్యక్ష ప్రసారంలో విక్షిస్తూ ప్రపంచం అంతా ధ్యానం చేస్తుందని తెలిపారు.

మనశ్శాంతి, సుధీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి  కోసం, వసుదైవ కుటుంబం, శాంతియుత ప్రపంచం కోసం ధ్యానం చేయాలని,  ప్రతినిత్యం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మన కుటుంబం, మన ఊరు, మన ప్రాంతం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటూ అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అని  తెలియజేశారు. ఈ మెడిటేషన్ కార్యక్రమంలో ఉరుమడ్ల అయ్యప్ప మాలదారులు  పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.