22 May, 2026 | 10:26 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

యరగండ్లపల్లి నూతన సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సన్మానం

21-12-2025 12:49 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో యరగండ్లపల్లి  గ్రామంలో టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా 627 ఓట్ల భారీ మెజారిటీ తో గెలుపొందిన  సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ తో పాటు వార్డ్ మెంబెర్స్  గా అత్యంత మెజారిటీ తో గెలుపొందిన వార్డ్ సభ్యులను ఆదివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసం లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఊరిలో వీధి దీపాలు,మంచి నీరు,పారిశుద్యం విషయంలో గ్రామంలో ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని  చెప్పారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మన పార్టీ పక్క పార్టీ అనుకోకుండా ఆపద వచ్చిన ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులు గానే భావించి ఆదుకోవాలని వారి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ , వార్డ్ సబ్యులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎరగండ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దం శ్రీనివాస్ గౌడ్, ,మాల్ మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు వనపర్తి వెంకటయ్య ,ch.ముత్యం రెడ్డి ,వనపర్తి నర్సింహా ,సేగోజు నర్సింహా చారీ,గుంటోజు శ్రీనివాసా చారి ,కోడిచెర్ల అంజయ్య, ఉప్పునూతుల మల్లేష్,కట్ల యాదయ్య, పార్టీ కార్యకర్తలు అయితగొని అంజయ్య,నారోజు అనిల్ చారీ,ఈడాగోని శ్రీను,కానుగుల క్రిష్ణ, వడ్డేపల్లి గణేష్ ,చామకూర గిరి, సూరు అబ్బయ్య  కార్యకర్తలు పాల్గొన్నారు.