12 March, 2026 | 10:54 AM

అందరికీ కిడ్నీ ఆరోగ్యం

12-03-2026 12:25 AM

సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్‌లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): చెన్నైకి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సంద ర్భంగా బుధవారం ‘అందరికీ కిడ్నీ ఆరో గ్యం’ అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజన్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. 2010 నుంచి తాము చేపట్టిన ఉప్పు తగ్గింపు ప్రచారం, 2012 నుంచి సిస్టినోసిస్ వంటి అరుదైన వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న తోడ్పాటును ఆయన వివరించారు. సినీ దర్శకులు శ్రీ రాజీవ్ మీనన్, సంస్థ రూపొందించిన ’ఉప్పు తగ్గింపు మార్గదర్శకాలను’ విడుదల చేశారు.

సమాజ ఆరోగ్యం పట్ల సేపియన్స్ ఫౌండేషన్ చూపుతున్న శ్రద్ధను ఆయన అభినందించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ టి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కిడ్నీ సంరక్షణ పద్ధతులపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులకు డైట్ రెసిపీ బుక్లెట్, ఉప్పును కొలిచే కొలత స్పూన్లను పంపిణీ చేశారు. ట్రస్టీ ఆర్. సుందర్ అతిథులకు స్వాగతం పలకగా, క్రేజీ బాలాజీ ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది.