శ్రీ శివాలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణ సైత లక్ష కుంకుమార్చన
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణ సహిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున వైభవంగా జరిగింది, ఈ కార్యక్రమం ఒక సంవత్సరం గా తీసుకొని. నెలలో ఒక మంగళవారంప్రారంభించుకుని నేటికీ ఏడు మాసములు పూర్తి చేయబడినది, ఇందులో పెద్ద ఎత్తున మహిళలు పట్టణ ఆలయ భక్తుబృందం పాల్గొని పారాయణతో పాటు కుంకుమార్చన గావించినారు.
ఈ కార్యక్రమం లోక కళ్యాణం కోసం రాష్ట్రం దేశం సుభిక్షంగాఉండాలని,మంచి వర్షాలు పాడిపంటలు , భక్తులకు ఈతి బాధలు తొలగుడం, కొరకు ఇలాంటి కార్యక్రమం అర్చకులు సంకల్పించి చేపట్టడం జరిగినది, లోక కళ్యాణం కొరకు చేపట్టే ప్రతి కార్యక్రమం ఇందులో పాల్గొన్న ప్రతి మహిళలకు వారి యొక్క ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం, కుటుంబ ఎదుగుదల, తద్వారా పట్టణం రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని ఆలయ అర్చకులు వల్లకొండ మఠం రమేష్ తెలిపినారు.
ఈ పారాయణ సహిత కుంకుమార్చన ఫిబ్రవరితో ముగుస్తుందని తెలిపారు, మహిళలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఆలయంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ , మరియు పాలకవర్గ సభ్యులు అన్ని సౌకర్యాలు, మహిళలు అందరికీ అల్పాహారం ఏర్పాట్లు చేశారు, ఇట్టి కార్యక్రమంలో అర్చకులు వల్లకొండ మఠం మహేష్ తో పాటు ధూపం శివప్రసాద్,(జగిత్యాల) పెద్ద ఎత్తున మహిళలు శివాలయం నిత్య భక్త బృందం, సేవకులు,పాల్గొన్నారు.






