ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యం
05-08-2026 09:44 PM
నాణ్యమైన సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సిబ్బంది సమన్వయం, అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటరత్నం బుధవారం ఐడిఓసి కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవలు, సిబ్బంది సమయపాలన, పారిశుధ్యంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది సమయపాలనపై నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.






