17 July, 2026 | 2:30 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

ప్రజా సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే హరీష్ బాబు

20-02-2026 01:20 AM

కాగజ్‌నగర్/బెజ్జూర్ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమానికి కృషి చేయడం జరు గుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్నగర్ మండలంలోని ఈజ్గాం గ్రామంలో రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మహిళా సమాఖ్య సభ్యులకు అందజేయాలని ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ మణిరాజ్లను ఆదేశించారు.

అలాగే బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, బారెగూడ సర్పంచ్ తేలి బాపు, ఏఎంసీ చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, సర్పంచ్ అగ్గిల్ల సంగీతశ్రీనివాస్, ఉపసర్పంచ్ లోకండె నరేందర్, నజుల్నగర్ సర్పంచ్ బికాస్ ఘరామి, తదితరులు పాల్గొన్నారు.