17 July, 2026 | 2:03 PM

నందిపేట తహసీల్దార్ సస్పెండ్

17-07-2026 01:54 PM

నందిపేట: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District) అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌కు(Illegal registration) సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో నందిపేట తహసీల్దార్ సంతోష్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్(Nandipet Tahsildar suspended) చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు సహకరించారన్న ఆరోపణలతో తహసీల్దార్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నాట్లు తెలిపారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా, సంతోష్ రెడ్డిని విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొనసాగుతున్న విచారణ ఫలితం ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.