17 July, 2026 | 1:54 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా

17-07-2026 01:34 PM

 ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

కొమురవెల్లి,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలో గల ముదిరాజ్ సంఘం భవనంలో కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు మత్స్యశాఖ సహకారంతో ఏర్పాటుచేసిన విత్తనాల, ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. రైతులు తప్పనిసరి ప్రామాణిక విత్తనాలు, నాణ్యమైన ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన సేవలు అందించడంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు స్థానిక సర్పంచ్ పద్మాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.