17 July, 2026 | 1:38 PM

Breaking News

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •   రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   •   హుజూర్ నగర్ అభివృద్ధిలో మరో మైలురాయి   •  

హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది

17-07-2026 01:24 PM
  1. భవిష్యత్తు అంతా హైడ్రోజన్‍దే
  2. హైడ్రోజన్ రైలుతో హర్యానా పేరు చిరిస్థాయిలో
  3. రైల్వే రూపురేఖలు మార్చడంలో కీలకమైన అడుగు
  4. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు
  5. హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్ పై సరికొత్త విప్లవం

హర్యానా: దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జింద్‌లో ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామని వెల్లడించారు. భవిష్యత్తు అంతా హైడ్రోజన్ దేనని ప్రధాని స్పష్టం చేశారు. పర్యావరణ హిత ప్రాధాన్యంలో భాగంగానే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సూచించారు. హైడ్రోజన్ రైలుతో హరియాణా పేరు చిరస్థాయిలో నిలుస్తోందని తెలిపారు. రైల్వే రూపురేఖలు మార్చడంలో ఇది కీలకమైన అడుగు అన్నారు.

హైడ్రోజన్ రైలు హార్స్ పవర్ @3,200

రూ. 14 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని సూచించారు. హైడ్రోజన్ రైలు.. జింద్-నోనిపత్ మధ్య 89 కిలో మీటర్ల దూరం నడుస్తోందని వివరించారు. దేశ ప్రజలంతా స్వచ్ఛతా మంత్రం పఠిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్ పై సరికొత్త విప్లవానికి నాంది అని ప్రధాని పేర్కొన్నారు. జింద్-సోనిపత్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ తో నడుస్తోందని వెల్లడించారు. జింద్-సోనిపత్ హైడ్రోజన్ రైలు 10 కోచ్ లతో నడుస్తోందన్నారు. 

ఎలాంటి సంక్షోభాలు వచ్చినా భారత్ అడుగులు అభివృద్ధి వైపే

మిగతా దేశాల హైడ్రోజన్ రైళ్ల కంటే ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రధాని వివరించారు. గత 12 ఏళ్లలో మన రైల్వేలో కీలక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందన్న నరేంద్ర మోదీ చమురు సరఫరా కీలక మార్గంలో అనిశ్చితి నెలకుందని సూచించారు. హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని మార్గాల్లో మనకు డీజిల్ తో నడిచే రైళ్లు ఉన్నాయని చెప్పారు. 2014 వరకు రైల్వేలో  విద్యుదీకరణ 30 మాత్రమే ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99 శాతానికి పెంచామని వివరించారు. ఎలాంటి సంక్షోభాలు వచ్చినా భారత్ అడుగులు అభివృద్ధి వైపేనన్న ప్రధాని తాము ఏం చేసిన ముందుచూపుతోనే పనిచేస్తామని స్పష్టం చేశారు.

భారత్ లో ఒలింపిక్స్ జరిగే సమయం ఎంతో దూరం లేదు

ప్రధాని మోదీ దృష్టి ఎప్పుడూ సమస్యల పరిష్కారంపైనే ఉందని చెప్పారు. భారత్ లో ఒలింపిక్స్ జరిగే సమయం ఎంతో దూరం లేదన్నారు. ఒలింపిక్స్ పోటీలకు తగినట్లు మన క్రీడాకారులను తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు.