20-02-2026 01:21:16 AM
కుభీర్, ఫిబ్రవరి 19: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతర, వేడుకలు గురువారం కుస్తీ పోటీలు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఆహుతుల ను అలరించాయి. కుస్తీ పోటీల్లో విజేతలైన మల్లయోధులను భుజాన ఎత్తుకొని ప్రాంగణమంతా కలియ తిరిగారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు రాత్రి 7 గంటలకు ముగిశాయి. ఈ పోటీల్లో మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్, నాందేడ్ కన్వర్ట్ తదితర ప్రాంతాల మల్లయోధులు తలపడ్డా రు. కుబీర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మోహన్, స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, నిర్మల్ జిల్లా లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు పాల్గొన్నారు.