13 July, 2026 | 7:48 PM

ఉచితంగా టేకు మొక్కల పంపిణీ

13-07-2026 06:59 PM

అశ్వారావుపేట,(విజయ క్రాంతి): వ్యవసాయ అటవీ పథకం కింద ప్రతి రైతుకు 100 టేకు మొక్కలు ఉచితంగా అందజేయబడతాయని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి కిషోర్ తెలిపారు. పొలంగట్లు వెంట వేయ డానికి ఈ టేకు మొక్కలు ఇవ్వబడతాయని ఆయన తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని కొబ్బరి విత్తనోత్పత్తి క్షే త్రంలో పెంచుతున్న టేకు మొక్కల నర్సరీని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అవస రమైన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం. ఆధార్కార్డు, బ్యాంకు పాస్పుస్తకం జిరాక్స్లు తీసుకొని అశారావుపేట .కొబ్బరి చిత్తనోత్పత్తి క్షేత్రం వద్దకు రావాలని.. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.