మహిళల టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ పెంపు
దుబాయి, ఏప్రిల్ 13 : వచ్చే జూన్‌లో మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. దీని కోసం ఐసీసీ భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. విజేతలకు అందజేసే ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో పెంచిన ట్లు వెల్లడించింది. 2 నెలల పాటు ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ కోసం సు మారు 82 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. గత సీజన్‌తో పోలిస్తే సు మారు 10 శాతం ప్రైజ్‌మనీ పెరిగింది.
ఈ సారి ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. 2024లో కేవలం 10 టీమ్స్ మాత్రమే పాల్గొన్నాయి. జూన్ 12వ నుంచి జూలై 5వ తేదీ వరకు ఏడు వేదికల్లో టోర్నీ కొనసాగనుంది. లార్డ్స్ మైదా నంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా గత వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ 74 కోట్లు ఉండగా, ఈసారి దాన్ని 82 కోట్లకు పెంచినట్లు ఐసీసీ ప్రకటించింది. టైటిల్ గెలిచిన విజేతకు ఈసారి 21.8 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది.






