24 February, 2026 | 8:05 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మాజీ కార్పొరేటర్ రజిత

24-02-2026 06:02 PM

ఉప్పల్,(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాలు రాణించాలని ఉప్పల్ మాజీ కార్పొరేటర్ రజిత అన్నారు. ఉప్పల్ కేకే గార్డెన్లో లావణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్  శిక్షణ పొందిన మహిళలకు ఆమె సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక పథకాలు అమలు చేశారని ఉచిత బస్సు మహిళా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పంపిణీ చిరు వ్యాపారులకు మహిళా పారిశ్రామికవేతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య ఫౌండేషన్ ఫౌండర్ లావణ్య సంధ్య టీచర్ వాణిమాధురి తదితరులు పాల్గొన్నారు