calender_icon.png 20 February, 2026 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్య భవనాలతో మహిళల అభివృద్ధి: సర్పంచ్ అరుణా దేశ్ పాండు

20-02-2026 01:16:46 PM

సమైక్య భవనాలతో మహిళల అభివృద్ధి: సర్పంచ్ అరుణా దేశ్ పాండు 

మఠంపల్లి ఫిబ్రవరి 20(విజయ క్రాంతి): మహిళా సమైక్య భవనాలతో మహిళల అభివృద్ధి సాధ్యపడుతుందని మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా సర్పంచ్ బాణోతు అరుణా దేశ్ పాండు నాయక్ అన్నారు. గ్రామంలో శ్రీ శక్తి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శుక్రవారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే మహిళల ప్రయోజనాల దృష్ట్యా 10 లక్షల రూపాయలతో భావన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని,గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట సమా వేశాలు అభివృద్ధి పనులు చేసుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిసి జేతరాం, ఎపిఒ ఉమా,కార్యదర్శి నరేష్, విఓఏ శ్రీనివాస్,వార్డు సభ్యులు నాగేశ్వరరావు, బాలరాజు,లాలు,హభి, రాజ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.