22 July, 2026 | 11:40 AM

సర్ ప్రక్రియ పారదర్శకంగా నమోదు చేయించాలి

22-07-2026 10:52 AM

జిల్లాలో ఎక్కడ ఓట్ చోర్ కు తావు  లేకుండా సర్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి

 వనపర్తి డిసిసి చీఫ్, శివసేన రెడ్డి 

వనపర్తి ( విజయక్రాంతి) : రాష్ట్రంలో నడుస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను  నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా, వేగవంతంగా పూర్తిచేయాలని బిఎల్ ఏ -2 లు, ఇన్చార్జిలు, మండల, పట్టణ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం సర్ ప్రక్రియ పురోగతిపై రివ్యూ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా డీసీసీ చీఫ్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఏప్పటికప్పుడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ కాల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఏ -2, ఇన్చార్జిలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. 

అలాగే సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి మండలాల గ్రామాల వారీగా నివేదికను పరిశీలిస్తూ.. కొన్ని గ్రామాలలో మందకోడిగా నడుస్తున్న బూత్ ల పై ప్రత్యేక దృష్టి పెట్టి నడుచుకోవాలన్నారు. మిగిలిన సమయాన్ని గుర్తుపెట్టుకుని, గ్రామాలను మండలల్లో ఉంటూ పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే 100% పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ  సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్, పట్టణాధ్యక్షులు కదిరే రాములు, ఇన్చార్జిలు, కోళ్ల వెంకటేష్, శరవంద, విజయలక్ష్మి, బి కృష్ణ, చంద్రమౌళి, పలువురు పాల్గొన్నారు