10 March, 2026 | 1:02 AM

టీఎన్జీవో ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

09-03-2026 02:20 AM

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలో తెలంగాణ ఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవం గా నిర్వహించబడ్డాయి. తెలంగాణ ప్రభు త్వ ఉద్యోగ సంఘాల నేతలు, మహిళాఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్ర మాన్ని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి, స్థానిక కార్పో రేటర్ మిక్కిలినేని మంజుల, టీజీఈజెఎసి రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదేన శ్రీనివా స్ ట్రెజరర్ వలపు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి జైపాల్, యర్రా రమేష్ శ్రీకాంత్, మహిళా విభాగం నాయకులు లలిత కుమారి, రాధికారెడ్డి, విజయ, మృదుల, సుబ్బమ్మ లావ ణ్య, శ్రావణి, పద్మ, రాంబాయి ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో, పరిపాలన లో మహిళా ఉద్యోగులు పోషిస్తున్న కీలక పాత్ర ను వక్తలు కొనియాడారు. మహిళా ఉద్యోగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళాఉద్యోగులను  సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.