6 July, 2026 | 2:48 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి

17-04-2026 03:42 PM

మధిర,(విజయక్రాంతి): కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒక మహిళా మృతి చెందిన ఘటన శుక్రవారం ఆంధ్ర తెలంగాణ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...మధిర మున్సిపాలిటీ పరిధిలోనే మడుపల్లి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఏపీ రాష్ట్రం పెనుగంచిప్రోలు మండలం శివపురం గ్రామంలోని మిర్చి కాయలు కోసేందుకు వెళ్లి వస్తుండగా మడుపల్లి-తాళ్లూరు సమీపంలో టాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో మడిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అన్నపూర్ణ(52) అక్కడికక్కడే మృతి చెందగా రాధా, సుల్తానా అనే మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారికి మధిరలోని ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మధిర పట్టణ సీఐ డి.రమేష్ పట్టణ ఎస్సై కిషోర్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.