31 May, 2026 | 2:02 PM

భర్త ముందే భార్య దారుణ హత్య

31-05-2026 01:22 PM

సంగారెడ్డి: గుర్తు తెలియని దుండగులు భర్త ముందే భార్య గొంతుకోసి హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అనిల్ కుమార్, మీనాదేవి అనే దంపతులు ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి దంపతులిద్దరూ బైక్ పై సంతకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఐడీఏ క్రీడా ప్రాంగణం దగ్గర బైకు ఆదిపోయింది. చెట్ల పొదల్లో నుంచి గుర్తు తెలియని దుండగులు వచ్చి భర్త అనిల్ పై దాడి చేసి భార్యను లక్కెళ్లారు.

తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దుండగులను అడ్డుకున్న అనిల్ పై కత్తితో దాడి చేసి, ఆపై మీనాదేవి గొంతుకోసి దారుణంగా హత్య చేసి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో మీనా అక్కడికక్కడే మృతి చెందగా, అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఐడీఏ బొల్లారం పోలీసులు ఘటనా స్తలికి చేరుకొని క్షతగాత్రుడని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త అనిల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పరారైన నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.