31 May, 2026 | 12:59 PM

దారా సలోమీ( సిడిపిఓ) పదవి విరమణ...

31-05-2026 11:38 AM

శుభాకాంక్షలు తెలియజేసిన డిడబ్ల్యుఓ లేనినా....

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఐసిడిఎస్ సిడిపిఓగా సేవలందించి ఆదివారం పదవి విరమణ పొందనున్న సందర్భంగా, ఐసిడిఎస్ అధికారులు పుష్పగుచ్చాలతో పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసారు. జిల్లాలోని త్రిమాత టెంపుల్ దగ్గరలోనే పెద్దమ్మ గుడి ప్రాంగణంలో ఈ పదవి విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా భద్రాద్రి జిల్లా డిడబ్ల్యూఓ లేనినా తో పాటు రిటైర్డ్ పిడి రమాదేవి, విజయలక్ష్మి పద్మశ్రీ హాజరై పుష్పగుచ్చాలు  షాలువాలతో సత్కరించి ధారా సలోమీ సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో భాగంగా మొక్కల రాజశేఖర్, హరిబాబు, లు పలువురు సిడి పి ఓవో, అధికారులకు మొక్కలను, చిన్నారి ప్రకృతి ప్రేమికుడు మహమ్మద్అఫన్ జైదీ చేత బహూకరింపజేశారు. ఈ సందర్భంగా ధారా సలోమి మాట్లాడుతూ, ఉద్యోగరీత్యా నాకు సహాయ సహకారాలు అందించిన ప్రాజెక్టు అధికారులకు అంగన్వాడీ టీచర్లకు, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత స్మృతులను గుర్తు వేసుకుంటూ, శేష జీవితాన్ని ఇలాగే ఆనందంగా సాగిపోవాలని, భవిష్యత్తులో సహాయ సహకారాలు అందించాలని కోరుకొన్నారు.