3 August, 2026 | 9:28 AM

గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

03-08-2026 08:53 AM

మల్లాపూర్, ఆగస్టు 2(విజయక్రాంతి):మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపూర్ గ్రామ శివారులోని గోదావరి నదిలో ఆదివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి వయస్సు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. మృతురాలు నావి బ్లూ రంగు డిజైన్ ఉన్న టాప్, పసుపు రంగు ప్యాంట్ ధరించి ఉంది, చేతికి ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులు ఉండగా, కుడి చేతిపై "అమ్మ" అని టాటూ ఉందని తెలిపారు.మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా ఆమెను గుర్తించగలిగిన వారు వెంటనే మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు లేదా మీకు సమీపంలో ఉన్నా పోలీస్ స్టేషన్‌ను సమాచారం అందించాలని కోరారు.మృతురాలు వివరాలు తెలిస్తే మల్లాపూర్ ఎస్‌ఐ ఎ. అనిల్  8712656796 నంబర్‌ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.