కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా
11-03-2026 12:00 AM
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పానని గుర్తు చేశారు. ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీలో ఉన్న మిత్రులు, కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకుంటావని సమయం, సందర్భం వచ్చిన రోజు తగిన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.




