మూత పడిన సర్కారు బడులు తీరుచుకునేనా?
- 2 ఏళ్లుగా ప్రాథమిక విద్యకు దూరమవుతున్న గిరిజన పిల్లలు...
- ఐటీడీఏ పరిధిలోని మూతపడ్డ 26 ఏకోపాధ్యాయ స్కూల్స్...
ఉట్నూర్, జూన్ 2౩ (విజయక్రాంతి) : ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలు మూతపడటంతో మారుమూల గిరిజన గ్రామాల పిల్లలు ప్రాథమిక విద్యలు దురవుతున్నారు. మూతపడ్డ పాఠశాలలు తెరుచుకుంటాయి లేదా అనే సంసిద్ధత ప్రజల్లో నెలకొంది. ఐటీడీఏ పరిధిలోని 26 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. ఈ పాఠశాల పరిధిలోని గిరిజన విద్యార్థులకు గత రెండేళ్ల నుండి ప్రాథమిక విద్యకు దూరమయ్యారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచిన ఎక్కడ సైతం ఏకోపాధ్యాయ పాఠశాలలు నేటికీ తెచ్చుకోలేదు. అదిలాబాద్ జిల్లాలో 14 గిరిజన గ్రామాల్లో ని బడి ఈడు పిల్లలు ప్రాథమిక విద్యకు దూరంగా ఉండిపోగా, కొమరం భీం జిల్లాలో 12 పాఠశాలలు మూతపడ్డాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమవుతాయని గిరిజనులు ఎదురుచూస్తున్న నేటికీ ఈ పాఠశాలలో తెరుచుకోలేదు. ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ మంద మకరందు తో పాటు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మూతబడిన పాఠశాలలను తెరిపించి గిరిజన పిల్లలకు ప్రాథమిక విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు..
తుమ్మగూడ పాఠశాలలో ఐదో తరగతి వరకు బోధించాలి...
ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామ పంచాయతీ కేంద్రంలోని గిరిజన విద్యా వికాస కేంద్రం (గిరిజన పాఠశాల)లో ఐదవ తరగతి వరకు విద్యా బోధన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో రెండవ తరగతి వరకు విద్యా బోధన చేయడంతో గిరిజన విద్యార్థులు మూడవ తరగతి చదువుకునేందుకు ఆశ్రమ పాఠశాలలకు వెళ్లేందుకు ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో ఎమ్మెల్యే స్పందించి తుమ్మగూడలో 5వ తరగతి వరకు విద్యా బోధన జరిగే విధంగా ఐటిడిఏ పిఓ తో మాట్లాడి విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం...: గోడం చందన్, డిప్యూటీ డిఈఓ, ఐటీడీఏ ఉట్నూర్...
ఐటీడీఏ పరిధిలో మూత పడిన పాఠశాలలను తెరిపించి గిరిజన విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యామ్నాయ చేస్తున్నాం.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మూతబడిన పాఠశాలలను నడిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకొని పాఠశాలలను ప్రారంభించామన్నారు. ఐదుగురు బడి ఈడు పిల్లలు గిరిజన గ్రామాల్లో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా సిఆర్టిలను నియమించుటకు చర్యలు తీసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో మూతబడిన 26 పాఠశాలలను తెరిపించుటకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..






