1 July, 2026 | 10:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పరిశ్రమలపై ప్రభావం చూపేనా?

21-03-2026 01:46 AM
  1. బడ్జెట్ కేటాయింపుల్లో స్వల్ప తగ్గింపు
  2. ఈ సారి రూ. 3,490 కోట్లు, గత బడ్జెట్‌లో రూ. 3,527 కోట్లు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : ఈసారి బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల రంగానికి రూ. 3,490 కోట్లు కేటాయించగా, గత 2025- బడ్జెట్‌లో ఈ రంగానికి రూ. 3,527 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో రూ. 37 కోట్ల మేర కోత పడింది. శాతంగా ఇది సుమారు 1 శాతం తగ్గుదలగా నమోదు కావడం విశేషం. ఈ తగ్గుదల పెద్ద మొత్తంలో కాకపోయినా, పరిశ్రమల వృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రాధాన్యతపై చర్చకు దారితీస్తోంది. సాధారణంగా పరిశ్రమల రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇంజిన్‌లా పనిచేస్తుంది.

పెట్టుబడులు ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, ఎగుమతులు పెంచడం వంటి అంశాల్లో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కేటాయింపులు తగ్గడం కొంత ఆందోళనకు గురిచేస్తోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం ఇతర ప్రాధాన్య రంగాలైన సంక్షేమ పథకాలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టిన నేపథ్యంలో పరిశ్రమల కేటాయింపుల్లో స్వల్ప కోత విధించిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక పరిమితులు, ఆదాయ వ్యయ సమతుల్యత దృష్ట్యా కొన్ని రంగాల్లో కేటాయింపులు తగ్గించడం అనివార్యమైందని అధికారులు చెబుతున్నారు. అయితే కేవలం బడ్జెట్ కేటాయింపులు మాత్రమే పరిశ్రమల అభివృద్ధిని నిర్ణయించవు. పాలసీ, పెట్టుబడిదారులకు అందించే ప్రోత్సాహకాలు, అనుమతుల ప్రక్రియ సరళీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు కూడా సమానంగా కీలకం. ఈ దిశగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పరిశ్రమల రంగ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.