23-02-2026 01:37:50 AM
క్లారిటీ ఇచ్చేసిన సీఎస్కే
చెన్నై, ఫిబ్రవరి 22 : ఐపీఎల్‌లో చెన్నై సూ పర్ కింగ్స్‌తో ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉండే బాండింగ్ చాలా ప్రత్యేకం. ధోనీ లేకుండా ఐపీఎల్‌ను, చెన్నై టీమ్‌ను ఊహించుకోలేం. గత కొంత కాలంగా ధోనీ రిటైర్మెం ట్‌పై చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ధోనీ ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నాడు. గత సీజన్ నుంచీ ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అదే సీజన్ ధోనీకి చివరిదంటూ జోరుగా ప్రచారం సాగింది.
ఇప్పుడు మరోసారి ఐపీఎల్ ముంగిట మహేంద్రుడి రిటైర్మెంట్‌పై చర్చ మొదలైంది. తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచై జీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. 2026 ఐపీఎల్ లో ధోనీ ఆడతాడని ప్రకటించారు. సీఎస్కే అంటే ధోనీ లేకుం డా ఉండదంటూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు. ఒకవేళ ఆటకు వీడ్కోలు పలికినా ఏదో ఒక పాత్ర ధోనీ చెన్నై సూపర్ కిం గ్స్ ఫ్రాంచైజీతోనే ఉంటాడని ఆయన స్పష్టం చేశారు.