24 April, 2026 | 4:20 AM

వన్యప్రాణుల క్రమ శిక్షణ

24-04-2026 12:00 AM

జన్నారం, ఏప్రిల్ 23: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్ళపేట అటవీ రేంజ్‌లోని తానిమడుగు బీట్‌లో ఏర్పాటు చేసిన సోలార్ బోర్ వెల్ వద్ద అర్ధరాత్రి సమయంలో అడవి జంతువులు క్రమశిక్షణతో వరుసగా నీరు తాగుతున్న దృశ్యాలు అక్కడ అమర్చిన కెమెరా ట్రాప్ చేసింది. ఈ నెల 22న తెల్లవారుజామున 1.45 గంటలకు ఈ దృశ్యం రికార్డు అయింది. జంతువులు ఒకదాని తర్వాత ఒకటి ప్రశాంతంగా నీరు తాగడం వాటి సహజ ప్రవర్తనను ప్రతిబింబిస్తోంది.