26 February, 2026 | 4:41 PM

భార్య కలెక్టర్.. భర్త ఎస్పీ.. మానుకోటలో సరికొత్త ఒరవడి

26-02-2026 02:46 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District Collector) ఏర్పడ్డ దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా భార్య కలెక్టర్, భర్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ శబరిష్ సతీమణి స్నేహ శబరిష్ ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుండగా, గురువారం ప్రభుత్వం ఆమెను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. దీనితో తొలిసారిగా మహబూబాబాద్ జిల్లా సారథులుగా సతిపతులు బాధ్యతలు నిర్వహించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు.