శుభారంభం ఎవరిదో?
- నేడు కోల్‌కతాతో ముంబై ఢీ
బుమ్రా రాకతో జోష్
గాయాలతో కోల్‌కతా సతమతం
ముంబై, మార్చి 28 : ఐపీఎల్ 2026 సీ జన్‌లో ఆదివారం రసవత్తర పోరు జరగబోతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలపడబోతున్నాయి. గత ఐదేళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఎదురుచూస్తోం ది.. వేలానికి ముందే ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టును పటిష్టం చేసుకుంది.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి మ్యా చ్ విన్నర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆల్‌రౌండర్ ప్రదర్శనతో విజేతగా నిలవాలనే పట్టుదలతో ముంబై ఉంది. ఏ సీజన్‌లోనూ తొలి మ్యాచ్ గెలవని సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని ఆ జట్టు భా విస్తోంది.
అయితే స్టార్ ఆల్‌రౌండర్లు విల్ జాక్స్, మిఛెల్ సాంట్నర్ కోల్‌కతాతో మ్యాచ్ కు అందుబాటులో లేరు. వీరిద్దరూ ఇంకా ముంబై జట్టుతో కలవలేదు. యితే స్టార్ ఆ ల్రౌండర్స్ విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్లు తొలి మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ ఇద్ద రూ ఇంకా ముంబై జట్టుతో కలవలేదు. సౌ తాఫ్రికాతో ఎప్పుడు చేరుతారనే విషయంపై క్లారిటీ లేదు. టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన విల్ జాక్స్‌పై ముంబై చాలా ఆశలు పె ట్టుకుంది.
కాగా సాంట్నర్ స్థానంలో అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఆడనుండగా.. విల్ జాక్స్ స్థానంలో మయాంక్ మా ర్కండేను ఆడించే ఛాన్సుంది. టీమ్ కాంబినేషన్‌ను చూస్తే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. దీంతో ర్యాన్ రికెల్టన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్ మిడిలార్డర్లో ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు.
మయాంక్ మార్కండే, అల్లా గజన్ఫర్ స్పిన్నర్లుగా ఆడనుండగా.. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా అశ్వని కుమార్, అథర్వ అంకోలేకర్, ర్యాన్ రికెల్టన్‌లో ఒకర్ని ఆడించే అవకాశముంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ది దీనికి భిన్నమైన పరిస్థితి. ఆ జట్టు గా యాలతో సతమతమవుతోంది. హర్షిత్ రా ణా, ఆకాశ్ దీప్ దూరమవడం, పతిరణ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవ డం కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పొ చ్చు. ముస్తఫిజుర్ స్థానంలో ముజర్‌బానీని తీసుకున్న కోల్‌కతా బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది.
కామెరూన్ గ్రీన్, వైభవ్ అరోరాపైనే పేస్ బౌలింగ్ భారం పడుతుంది. అటు స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తితో పాటు సునీల్ నరైన్ కీలకం కానున్నారు. ఇక బ్యాటింగ్‌లో కేకేఆర్ టాపార్డర్ బలంగా కనిపిస్తోంది. ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్ రాకతో మరింత స్ట్రాంగ్ అయింది. వీరికి తోడుగా రహానే, రచిన్ రవీంద్ర, రమణ్‌దీప్, రింకూ కూడా కోల్‌కతాకు బలమని చెప్పొచ్చు.
పిచ్ రిపోర్ట్
వాంఖడే పిచ్ సహజంగానే బ్యాటర్లకు అ నుకూలంగా ఉంటుంది. ఆరంభంలో కాస్త పేస్, బౌన్స్ కనిపించినా ఇక్కడ భారీస్కోర్లు నమోదవుతాయి.
గత రికార్డులు
హెడ్ టు హెడ్ రికార్డుల్లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 35 మ్యాచ్‌లలో తలపడగా ముం బై 24 సార్లు గెలిచింది. కేకేఆర్ 11 మ్యాచ్‌లో విజయం సాధించింది.
తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్ : రోహిత్, డికాక్, సూర్యకుమార్, తిలక్, హార్థిక్ (కెప్టెన్) రూథర్ ఫర్డ్, విల్ జాక్స్ , శార్థూల్, దీపక్ చహర్, బుమ్రా, బౌల్ట్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : నమన్‌ధీర్/అశ్వని కుమార్
కోల్‌కతా నైట్‌రైడర్స్ : ఫిన్ అలెన్, రహానే(కెప్టెన్), గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, నరైన్, కార్తీక్ త్యా గి, వైభవ్ , ముజర్‌బానీ, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్ : తేజస్వి దహియా/అంకుల్ రాయ్




