13 March, 2026 | 10:39 AM

కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు?

13-03-2026 12:33 AM
  1. రెండున్నర సంవత్సరాలుగా అర్జీదారులకు అందని పెన్షన్లు 

బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్‌రెడ్డి

తరిగొప్పుల, మార్చి 12 (విజయక్రాంతి): హామీలు అమలు పరచడంలో, సర్కార్ విఫలం అయింది అని మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రెండున్నర సంవత్సరాలు గడిచిన అప్పటికి  చెప్పిన హామీలు, నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని  ప్రజల్లో ప్రభుత్వంపై  అవిశ్వాస పుడుతుంది,అని ఎన్నికల సమయంలో, భూమికి ఆకాశానికి, అందని హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తుందని, 229 పింఛన్ల దరఖాస్తులు రాగా ఎంపీడీవో కార్యాలానికే పరిమితం అయిపోయాయి కార్యాచరణ మాత్రం పొందలేదు,

కొత్త పింఛన్లు రాక వృద్ధులు, వితంతువులు , ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్జీదారులకు న్యాయం చేకూర్చాలని, వృద్ధులకు, వితంతులకు, 4000 పింఛన్లు మంజూరు చేస్తామని, హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ఏనాడు కూడా పింఛన్ల కోసం మాట్లాడిన పాపాన పోలేదు, ఇప్పుడు, రైతులు, రైతు భరోసా కోసం, ఎదురుచూస్తున్నారు. మరి రైతు భరోసా ఎప్పుడు వస్తది రాదా అన్నట్టు, రైతుల్లో అయ్యో మాయం మొదలైంది రాజీవ్ యువ వికాసం అర్జీలు కూడా ఆన్లైన్ వరకే పరిమితమై ఉన్నాయి, ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.