స్కల్ బేస్ ఎండో స్కోపీ సమ్మిట్ విజయవంతం
సదస్సును ప్రారంభించిన యశోదా డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): అంతర్జాతీయ స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ 2.0ను సెంటర్ ఫర్ న్యూరో ఎండోస్కోపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి డైరెక్టర్ పవన్ గోరుకంటి చివరి రోజు సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
యశోద ఆసుపత్రి డాక్టర్. విజ య్ కుమార్ ఆధ్వర్యంలో సదస్సును విజయవంతంగా నిర్వహించారు. సదస్సు ఏప్రి ల్ 24న ప్రారంభమైంది. ఆదివారం (26) విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు. ఈ సదస్సులో ప్రపంచస్థాయి అకడ మిక్ వేదికగా 500 మందికి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు పా ల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూరోసర్జన్లు, స్కల్ బేస్ శస్త్ర చికిత్స నిపుణులు, ఈఎన్‌టీ, అకడమిషియన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు ఒకే వేదికపై నూతన ఆవిష్కరణలపై చర్చించారు.
మెదడులోని కణతులకు, అత్యాధునిక ఎండో స్కోపిక్ శస్త్రచికిత్సా విధానాలపై చర్చించారు. బ్రెయిన్ ట్యూమర్స్‌ను విజయవంతంగా తొలగించేందుకు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరో ఎండోస్కోపీ సర్జరీ విధానాలు, ‘స్కల్ బేస్’ కేడావెరిక్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, లైవ్ బ్రెయిన్ సర్జరీలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడు తూ.. తమ దృష్టి కేవలం వైద్య సేవలకే పరిమితం కాదని, నూతన ఆవిష్కరణలు, వైద్య రంగం భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
ఈ క్రమంలో ‘యశోద సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ (వైసీఎన్‌ఇ) న్యూరోఎండోస్కోపీ రంగంలో క్లినికల్ ఎక్సలెన్స్, శిక్షణ, పరిశోధనలో కీలక పాత్రను కొనసాగిస్తుందన్నారు. మూడురోజులపాటు కొనసాగిన ఈ శాస్త్రీయ సదస్సులో లెక్చర్లు, నిపుణుల ప్యానెల్ చర్చలు, కేస్-బేస్డ్ లెర్నింగ్ సెషన్లు, లైవ్ సర్జరీ డెమోస్ట్రేషన్ సమగ్రంగా నిర్వహించామన్నారు. హ్యాండ్స్- ఆన్ క్యాడవరిక్ ట్రైనింగ్ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని గోరుకంటి వివరించారు.
ఈ సదస్సు ద్వారా ప్రపంచ న్యూరోసర్జరీ రంగానికి తన వంతు సహకారం అందించినట్లు గోరుకంటి స్పష్టం చేశారు. సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్. అయ్యాదురై మాట్లాడుతూ.. స్కల్ బేస్ సర్జరీకి అత్యంత ఖచ్చితత్వం, నైపుణ్యం, నిరంతర అభ్యాసం అవసరమని చెప్పారు. ఎండోస్కోపిక్ ఎండోనాసల్ స్కల్ బేస్ సర్జరీ, క్లిష్టమైన లెషన్స్‌కు ట్రాన్స్‌స్క్రి నియల్ విధానాలు, పిట్యూటరీ ట్యూమర్లు, సెల్లార్ ప్రాంత సమస్యల నిర్వహణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగిందని వివరించారు.
అలాగే అంటీరియర్, మిడిల్, పోస్టీరి యర్ స్కల్ బేస్ లెషన్స్, సీఎస్‌ఎఫ్ లీక్ రిపేర్ టెక్నిక్స్, రీకన్‌స్ట్రక్షన్ విధానాలు, మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరోసర్జరీ, రోబోటిక్ సర్జరీ లో నూతన అభివృద్ధులపై నిపుణులు సవివరంగా వివరించారు. అదనంగా న్యూరో నావిగేషన్, ఆపరేటివ్ ఇమేజింగ్, టెక్నాలజీ ఆధారిత ఖచ్చితమైన శస్త్రచికిత్స విధానాలు, కాంప్లికేషన్స్ నివారణ, నిర్వహణపై కేస్-బేస్డ్ చర్చలు నిర్వహించబడ్డాయన్నారు. ఈ సదస్సుకు అమెరికాకు చెందిన డాక్టర్. థియో డర్ హెచ్ ష్వారట్జ్, హాంగ్ కాంగ్‌కు చెందిన డాక్టర్. కాల్విన్ మాక్, సికింద్రాబాద్‌లోని సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్. అయ్యదురై డైరెక్టర్లుగా వ్యవహరించారు.






