calender_icon.png 24 February, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాంఖేడేలో విండీస్ విశ్వరూపం

24-02-2026 12:55:17 AM

  1. హెట్ మెయిర్, పావెల్ ఊచకోత
  2.   19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ 
  3. వరల్డ్ కప్‌లో హయ్యస్ట్ స్కోర్ 

ముంబై,  ఫిబ్రవరి 17 : టీ20 క్రికెట్ అం టే ఎలా ఉంటుందో కరేబియన్ టీమ్ రుచి చూసింది. జింబ్వాబ్వేతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా హెట్ మెయిన్ జింబాబ్వే బౌలర్లను ఊతకోత కోశాడు. అతనితో పాటు పావెల్ కూడా రెచ్చిపోయాడు. ఫలితంగా విండీస్ ప్రపంచకప్‌లోనే అత్యధిక స్కోరు నమోదైంది. ఆరంభంలో అద్భుతంగా బౌ లింగ్ చేసిన జింబాబ్వే హెట్ మెయిర్ వచ్చి న తర్వాత లైన్ తప్పి భారీగా పరుగులు సమర్పించుకుంది.

ఆరంభంలోనే అతని క్యాచ్ని వదిలిపెట్టడంతో.. సిక్సర్ల మోత మో గించాడు. సికందర్ రజా బౌలింగ్లో వరుస సిక్సర్లు బాదిన హెట్మెయర్ కేవలం 19 బం తుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హెట్మెయర్ అటాకింగ్తో వెస్టిండీస్ జట్టు కేవలం 9.1 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసుకుంది. మొదటి పది ఓవర్ల తర్వాత రెచ్చిపోయిన వెస్టిండీస్ బ్యాటర్లు 13 ఓవర్లు ముగిసే సమయానికి 150 పరుగులు నమోదు చేశారు.  ఆ తర్వాత రెట్టింపు వేగంతో మరింత దూకుడుగా ఆడాడు.

రోవ్మన్ పావెల్ 29 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 34 బంతులు ఆడిన షిమ్రోన్ హెట్మెయర్ 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి అవుటయ్యాడు. హెట్మెయర్ - పావెల్ కలిసి మూడో వికెట్కు 52 బంతుల్లో 122 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 35 బంతులు ఆడిన పావెల్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి అవుటయ్యాడు. మొదటి పది ఓవర్లలో 115 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు.. ఆఖరి పది ఓవర్లలో 139 పరుగులు చేసింది.

ఆఖర్లో రూథర్ ఫోర్డ్ 13 బంతుల్లో 31, రొమారియో షెఫర్డ్ 10 బంతుల్లో 21 పరుగులు ,. ఆఖరి ఓవర్లో 6, 6, 4 రావడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా 3 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు.  తర్వాత ఛేజింగ్‌లో జింబాబ్వే చేతు లెత్తేసింది. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమం లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్రాడ్ ఈవెన్స్ 43 , మేయర్స్ 28, సికిందర్ 27  తప్పిస్తే మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో జింబాబ్వే 147 పరుగులే చేయగలిగింది.