18 July, 2026 | 4:33 PM

Breaking News

పదోన్నతి పొందిన ఈఈకి సన్మానం   •   రాజీ మార్గమే రాజ మార్గం   •   సామూహిక మరుగుదొడ్లు ప్రారంభించిన కలెక్టర్   •   భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •  

బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

21-11-2025 12:00 AM
  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్

బాధిత కుటుంబాలకు కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పరామర్శ

ముషీరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): సౌదీ అరేబియా బస్సు ప్రమాదం బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్ లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.

ఈ మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం18 మంది మృతి చెందిన కుటుంబంతో పాటు ఇతర బస్సు ప్రమాద మాదిత కుటుంబాలను ఆయన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్, యువ నాయకుడు ముఠా జై సింహలతో కలిసి ఆయన పరామర్శించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. భారత దౌత్యధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని తెలిపారు. ఇంత పెద్ద దుఃఖం మరెవరికి రాకూడదని అన్నారు.

వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆ భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు. కోరారు. యాత్రికులతో వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొ నడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.