29 July, 2026 | 10:53 PM

కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

29-07-2026 10:14 PM

* రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుంది

* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

 ఉట్నూర్,(విజయక్రాంతి):  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  వివిధ మండలాల్లో  భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి  కౌలు రైతుల సమస్యలు పరిష్కరించుటకు  తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్ లో ఏర్పాటు చేసిన రైతు స్వరాజ్యం కార్యక్రమానికి హాజరైన నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  హాజరయ్యారు.ముందుగా రైతుల సమస్యలను,రైతు సంఘాల ద్వారా తెలుసుకున్నారు.

వారి డిమాండ్లను కౌలు రైతులు ఎమ్మెల్యే కు వినతి పత్రం ద్వారా తెలియజేశారు.వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే  మాట్లాడుతూ...రైతు సంఘాల డిమాండ్స్ నీ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తానని,కౌలు రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని,కచ్చితంగా ముఖ్యమంత్రి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని తను నమ్ముతున్నానని ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే  ఇచ్చిన హామీకి రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయ్.ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక  జిల్లా అధ్యక్షుడు బోరన్న,పి ఆర్ టి యు సంఘం,రైతు సంఘం నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.