టెర్మినేషన్ పేరుతో బెదిరిస్తే ఊరుకోం
- విద్యుత్ కార్మికులకు అండగా ఉంటాం
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మహబూబాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): న్యాయమైన సమస్యల పరిష్కారం, సర్వీ స్ రెగ్యులర్, ఇతర కోరికల సాధన కోసం, కాంగ్రె స్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విద్యుత్ కార్మికులను టెర్మినేషన్ పేరుతో వేధిస్తే సహించేది లేదని, విద్యుత్ కార్మికులకు బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు తెలిపారు.
విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరుకున్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహిస్తున్న సమ్మె దీక్ష శిబిరాన్ని ఎర్రబెల్లి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 23,675 మందిని ప్రభుత్వ సంస్థలో విలీనం చేసి, ఆర్టిజన్‌గా గుర్తించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేసి వారికి రావాల్సిన ఏపీఎస్‌ఈబీ రూల్స్ అమలు చేసి కార్మిక సమస్యలన్నీ పరిష్కరిస్తానని వాగ్దానంచేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా కార్మిక సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచే యడం సబబుకాదని హితవుపలికారు.
కార్మికుల సమస్యలపై నోటీసు ఇచ్చి సుమారు 6 నెల లు అయినా చర్చలకు పిలువకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సమ్మె చేపట్టి ఐదు రోజులు గడు స్తున్నదని తెలిపారు. కార్మికులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ వారికి చర్చలు పిలవ కుండా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి భయబ్రాంతులకు గురిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్ప దని హెచ్చరించారు.
కార్మికులను కష్టాలు పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని, ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్ మ్యాన్ కార్మికులందర్నీ రెగ్యులర్ పోస్టులోకి తీసుకొని కనీస వేతనం ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, మిగిలిపోయిన పీస్ రేట్ కార్మికులందరినీ తక్షణమే రెగ్యులర్ చేసి జీవో నంబర్ 11 ప్రకారంగా వేతనం చెల్లించాలని, విద్యుత్ సంస్థలో ఒకే సర్వీ స్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్‌చేశారు.
కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ కంపెనీ విద్యుత్ కార్మిక సంఘం చైర్మన్ ధరావత్ సికిందర్, మహబూబాద్ జిల్లా కో కన్వీనర్ మచ్చ సతీశ్, డివిజన్ చైర్మన్ కన్వీనర్ పసుపులేటి మధు, బంధారపు శీను, నాగరాజు, ఖాజాబీ, సునీల్‌కుమార్, జ్యో తి, స్వప్న, చంద్ర ప్రకాష్, సుభాష్, ఉపేందర్, రా మకృష్ణ, సందీప్, రవికాంత్, శ్రీరామ్, నారాయ ణ, రవి, నవీన్, భూపాల్, ఎల్లగౌడ్ పాల్గొన్నారు.




