calender_icon.png 13 February, 2026 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు అంగన్వాడీలో పాలు, అన్నం పెట్టం

13-02-2026 02:05:52 PM

పైతర అంగన్వాడీ టీచర్ నిర్వాకం...

కొల్చారం,(విజయక్రాంతి): మీకు సంబంధించిన వ్యక్తి  మరణించాడు. దిన కార్యాలు ముగిసే వరకు మీకు అంగన్వాడీ కేంద్రంలో అన్నం పాలు, గుడ్లు ఇవ్వం అంగన్వాడీ కేంద్రం ఒక గర్భిణి, ఒక బాలింత లకు అన్నం గుడ్లు పాలు ఇవ్వడానికి నిరాకరించిన సంఘటన శుక్రవారం కొల్చారం మండలం పైతర అంగన్వాడి కేంద్రం వద్ద జరిగింది.

గ్రామానికి చెందిన బోయిని దుర్గమణి, బోయిన సంధ్య  లు శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో అన్నం, గుడ్లు, పాలు తీసుకోవడానికి వెళ్ళగా మీకు సంబంధించిన వ్యక్తి  మరణించాడు. అందువల్ల మీకు ఈరోజు అన్నం గుడ్డు పాలు ఇవ్వడం కుదరదు అంటూ నిరాకరించడం కు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆ ఇద్దరు గర్భిణీ, బాలింతలు  ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీ బాలింతల పట్ల కఠినంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.