3 July, 2026 | 3:15 AM

చెరువులకు హద్దులు ఏర్పాటు చేయాలని వినతి

03-07-2026 01:58 AM

దామరచర్ల జులై2: మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మకుంట, పంగవాని కుంట చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డికి గురువారం తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లావూరి క్రాంతి కుమార్ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెరువులను సర్వే చేసి అభివృద్ధి చేయాలని కోరారు. స్పందించిన ఆర్డివో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ వారు జాయింట్ సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.