13-02-2026 02:35:28 PM
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్(Telangana Municipal Election Results) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించిన మెజారిటీ మునిసిపాలిటీలలో విజయం సాధించింది. నేరేడుచర్ల, హుజూర్‌నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, భూత్‌పూర్, ధర్మపురి, భీమ్‌గల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణ్‌ఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్‌పూర్, ఆందోల్-జోగిపేట్, సదాశివపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, రామాయంపేట, మద్దూరు, పెబ్బేరు, మధిర, ఇల్లెందు, వైరా, కల్లూరులో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.
గడ్డపోతారం, గుమ్మడిదల, అయిజ, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి స్థానాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విజయం సాధించింది. వడ్డేపల్లి మునిసిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. కాగా, దేవరకద్ర, అలంపూర్, కోహీర్, ఆలియాబాద్, కేసముద్రం, జమ్మికుంట, వేములవాడ, జహీరాబాద్, ఆసిఫాబాద్, అమరచింత, కిఠాన్‌పల్లి, జనగాం, జిన్నారం, రాయికల్‌తో సహా పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి.