13-02-2026 02:01:33 PM
11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం
01 ఇండిపెండెంట్, 01 బీఆర్ ఎస్ గెలుపు
మంథని, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 11, ఇండిపెండెంట్ 0 1, బీఆర్ ఎస్ 01 అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు 01 వార్డులో కర్రు లింగయ్య 221 ఓట్ల మెజారిటీ, 2 వార్డులో నూకల కమల్ 212 ఓట్ల మెజారిటీ, 4 వార్డులో ఎరుకల స్రవంతి 164 ఓట్ల మెజారిటీ, 5 వార్డులో ముసుకుల సహేందర్ రెడ్డి 53 ఓట్ల మెజార్టీ, 7 వార్డులో జంబోజు సమ్మయ్య 63 ఓట్ల మెజారిటీ, 8 వార్డులో నరేడ్ల విజయలక్ష్మి 362 ఓట్ల మెజారిటీ, 9 వార్డులో మారుపాక నిహారిక 327 మెజార్టీ, 10 వార్డులో పెంటరి రాజు 396 ఓట్ల మెజారిటీ, 11 వార్డులో వోడ్నాల శ్రీనివాస్ 270 ఓట్ల మెజారిటీ, 12 వార్డులో వేముల విజయలక్ష్మి 202 ఓట్ల మెజార్టీ, 13 వార్డులో ఎల్లంకి వంశీ 264 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు.
3 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాచీడి రాజు గౌడ్ 44 ఓట్ల మెజారిటీ, 6 వ వార్డ్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరవేణి క్రాంతి 474 మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ అభ్యర్థులు అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరవేణి శ్రీలత భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంథని పట్టణంలో అట్టహాసంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.