10 March, 2026 | 2:06 AM

ఆక్రమిత ప్రభుత్వ భూములు పేదలకు పంచుతాం

10-03-2026 12:39 AM

- ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్, మార్చి 9 (విజయక్రాంతి): ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం తిమ్మాపూర్ లో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. స్థానికులు కొందరు తి మ్మాపూర్ లో పలు చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టుగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలా లు కబ్జాకు గురవుతుంటే చూస్తూ ఉర్కోబోమని స్పష్టం చేశారు. తిమ్మాపూర్ లో సర్వేలు జరిపించి ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ దిశగా రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి లేని నిరుపేదలకు ఆ స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. నిర్మాణం పనులు చేపట్టనున్న ఆరోగ్య ఉప కేంద్రం స్థలం వద్ద నీరు నిలవకుండా కాలువ ద్వారా మళ్లించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమాల్లో తిమ్మాపూర్ తహశీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి మల్హోత్ర, ఎంపీవో ప్రదీప్, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ పైడిపల్లి అంజిబాబు, మండల వైద్యాధికారి డాక్టర్ ప్రసిల్లా, డాక్టర్ పుల్లారావు, పశువైద్యాధికారి డాక్టర్ టి.మౌనిక, పంచాయతీరాజ్ ఏఈ స్నేహజ్యోతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు శ్రీగిరి రంగారావు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.