9 April, 2026 | 5:32 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

కులగణన చేసి తీరుతాం !

06-10-2025 12:45 AM

-ప్రజలను వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దని అధికారులను ఆదేశించా

-కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

కర్ణాటక, అక్టోబర్ 5( విజయక్రాంతి) : ఎవరు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా కులగణనను పూర్తి చేసి తీరుతామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను వ్యక్తి గత ప్రశ్నలు అడగవద్దని కుల గణనకు వెళ్లే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

సర్వే చేస్తున్న సమయంలో ప్రజలు పంచుకోలేని ప్రశ్నలకు అధికారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. సర్వే నిర్వహించే అధికారులు స్వతంత్ర కమిషన్‌కు చెందిన వారని... ఆ సమయానికి వారు ఏం చేస్తున్నారో తెలియదన్నారు. 2015లో కర్నాటక వెనుకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంత రాజ నేతృత్వంలో కులగణన చేపట్టగా, ఈ డేటా ఆధారంగా కె. జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలో పూర్తి స్థాచి నివేదిక తయారు చేసి సర్కార్‌కు సమర్పించింది. 

ఆర్థిక, సామాజిక సమీక్షపై రూ పొందించిన నివేదికను కర్ణాటక ప్ర భుత్వం గతంలోనే ఆమోదించింది. అ యితే, నిఫుణులు రూపొందించిన నివేదికపై భిన్నాభిప్రాయాలు, పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కులగణన చేపట్టింది.