27 July, 2026 | 12:30 PM

Breaking News

100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •  

పర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలి

05-06-2026 03:38 PM

సర్పంచ్ సతీష్ 

వాంకిడి, (విజయక్రాంతి): పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సతీష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని, శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్యదర్శి, వార్డ్ మెంబర్లతో కలిసి సర్పంచ్ సతీష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. కాలుష్య కారకాల నివారణ కోసం 1972 నుంచి యునైటెడ్ నేషన్ ప్రతి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి శివకుమార్,వార్డు సభ్యులు మండోకర్ తూర్సుబాయ్, షేక్ సాహీద్,దుర్గం,సునీత, అల్లఓజు,సంధ్యారాణి, స్నేహజ, దుర్గంసునీత,రాము, వాసకే తాను బాయి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మండోకర్ అనిల్, అంగన్వాడీ టీచర్ లు  రుక్మిణి, ప్రేమల, లక్ష్మి, భగవతి, ఉష, తదితరులు పాల్గొన్నారు