22-02-2026 07:24:12 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని బాధ్యతలు స్వీకరించిన ప్రజా ప్రతినిధులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. చిట్యాల మున్సిపాలిటి నూతన మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పందిరి గీత - రమేష్ కి, వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండెబోయిన శ్రీలక్ష్మి - సైదులు కి మరియు మున్సిపల్ కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, తెలంగాణ మదర్ డయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిట్యాల పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.