26 April, 2026 | 3:41 AM

మూడు రోజుల్లో పరిష్కరించాం

26-04-2026 12:34 AM
  1. శంకర్‌గౌడ్ మృతి బాధాకరం
  2. గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకూ పిలవలే
  3. ఆర్థిక ఇబ్బందులున్నా, సంక్షేమ పథకాలను అమలు చేస్తాం
  4. జూన్ తొలివారంలో సీఎం రేవంత్ జగిత్యాల పర్యటన?
  5. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

జగిత్యాల, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను బీఆర్‌ఎస్ కేసీఆర్ సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని, కాం గ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించిందని రాష్ట్ర సాంఘీక సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల మార్కెట్ కమి టీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారం జగిత్యాలలోని పొన్నాల గార్డెన్స్‌లో నిర్వ హించగా ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు.

జగిత్యాలలో ఆర్టీసీ జేఏసీ నాయకులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఇతర నాయకులను సన్మానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు చర్చలు జరిపారన్నారు. సమస్యలను పరిష్కరించారన్నారు. నాటి ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. కేవలం మూడురోజుల్లోనే సమ్మెకు ముగింపు పలికామని, శంకర్ గౌడ్ మృతి బాధాకరమన్నారు.

కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెలా రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని ఆరోపించారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నా రు. జగిత్యాలలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామని అడ్లూరి వివరించారు. మే 20 నుంచి జూన్ తొలివారంలో సీఎం జగిత్యాల పర్యటనకు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని సమస్యలను క్యాబినెట్‌లో ముందు పెట్టానని చెప్పారు. 

వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ ఫాం పంటసాగుపై దృష్టి సారించాలని ప్రస్తు తం ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నా రు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పంటలతోపాటు వాణిజ్య పంటలను సాగుచేయాలని, పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వం తరుగు తప్ప తాలు పేరుతో తూకం లో కోతలు విధించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటిదేమీ లేదని, ధాన్యం కొనుగోలు చేస్తున్నామని జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ స్పష్టం చేశారు. రైతులను దళారుల నుంచి కాపాడాలని, మద్దతు ధర అందించేందుకు కృషి చేయాలని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి అన్నారు. 

గిట్టుబాటు ధరతోపాటు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.