21 May, 2026 | 1:45 AM

ఎన్నికల్లో సమన్వయంతో సాగాలి

21-05-2026 12:25 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

నాగోల్, మే 20 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఎల్‌ఎ సమావేశం విజయవంతం కావడంతో నాగోల్, జీఎస్‌ఐ డివిజన్లకు చెందిన ఆశావహులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు.

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి డివిజన్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. నాయకత్వం ఎవరికి దక్కినా పార్టీ విజయమే అందరి లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే స్థానిక స్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు.

యువత, మహిళలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, తూర్పటి చిరంజీవి, అనంతుల రాజారెడ్డి, సతీష్ యాదవ్, పోచబోయినా గణేష్ యాదవ్, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, అనంతుల శ్రీనివాస్ రెడ్డి, పల్లె శ్రీరాములు, శిల్పారెడ్డి, రంగేశ్వరి, చిత్రల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.