21 May, 2026 | 1:37 AM

ఎస్‌ఎన్డీపీ పనులకు లైన్ క్లియర్

21-05-2026 12:24 AM

ఎంఎంసీ నుంచి నిధులు మంజూరు

మేడిపల్లి, మే 20 (విజయక్రాంతి): గత కొన్ని సంవత్సారాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎన్డీపీ పనులకు ఎట్టకేలకు లైన్‌క్లీయర్ అయ్యింది. బోడుప్పల్ మాజీ మేయర్ చొరవతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ్ణారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం చేయించి నిధులను మంజూరు చేయడంతో పనులు ప్రారంభం కానున్నాయి. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్‌ను బోడుప్పల్ మాజీ మేయర్ బృందం కలిసింది.

ఈ సందర్భంగా మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 110 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం అంటూ హడావుడి చేశారే కానీ పనులకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. దీంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టుపట్టి మరీ ఈ నిధులు మంజూరు చేయించానన్నారు.

బోడుప్పల్ సర్కిల్ ప్రజలకు వర్షాకాలంలో వరద బాధలు తీర్చేందుకు గాను ఎస్‌ఎన్డీపీ నిధులు మంజూరు చేయాడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి శ్రీధర్ బాబుకి, ఎంఎంసీ కమిషనర్ ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డికి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్‌కి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.