18 August, 2026 | 8:20 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం

18-08-2026 07:34 PM

భీమిని,(విజయక్రాంతి): ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో పశు పోషణ, శాస్త్రీయ పశుపోషణ యాజమాన్య పద్ధతులపై మంగళవారం రాంపూర్ రైతు వేదికలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ... దూడల యాజమాన్యం ప్రాముఖ్యత, నాణ్యమైన పశుగ్రాసం, పశుగ్రాస యాజమాన్య పద్ధతులు, మేకల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. అలాగే, పశువులకు సమతుల్య ఆహారం అందించడం, నాణ్యమైన పశుగ్రాసం వినియోగించడం, దూడల ఆరోగ్యకరమైన పెరుగుదలకు తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు, మేకల ఆరోగ్యం మరియు ఉత్పాదకత పెంపొందించేందుకు పాటించాల్సిన మంచి యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్, బిట్టూర్‌పల్లి సర్పంచ్ దశరథ్, ఏఈఓ  సుప్రజ, కర్నె శ్రీనివాస్, గోపాలమిత్ర తిరుపతి ఇతర రైతులు పాల్గొన్నారు.