చెరువుల సుందరీకరణకు సహకరించాలి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసిన వజ్రెష్ యాదవ్
మేడిపల్లి, మే 19 (విజయక్రాంతి): చెరువుల సుందరీకరణ, పరీరక్షణ కోసం సహకరించాలని కోరుతూ మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వజ్రెష్ మాట్లాడుతూ బోడుప్పల్‌లోని రా చెరువు, ఫీర్జాదీగూడలోని పెద్ద చెరువులను పూర్తిస్థాయిలో బండ్‌గా తీర్చదిద్దాలని, అదే విధంగా చెంగిచెర్ల చింతల చెరువును సుందరీకరించి కలుషిత జలాలు చెరువులో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకుర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, ఫీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్, ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






