7 April, 2026 | 9:42 PM

రోడ్డుపై గుంతల పరిష్కారానికి కృషి

07-04-2026 07:45 PM

అధికారులతో కలిసి పర్యవేక్షించిన తుంగతుర్తి రవి

​మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి 9వ డివిజన్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నుండి పర్వతపూర్ సిపిఆర్ఐ రోడ్డులోని సాయి ఐశ్వర్య కాలనీ వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారై, గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి మంగళవారం మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు రోడ్డు వేసినప్పటికీ, డ్రైనేజీ, వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోవడం వల్ల తరచూ గుంతలు పడుతున్నాయని పేర్కొన్నారు. ​నీరు నిలవకుండా ఉండేందుకు రోడ్డును తగినంత ఎత్తుకు పెంచాలి. నీరు సాఫీగా వెళ్లేందుకు కొత్తగా మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయాలి. నాణ్యమైన పద్ధతుల్లో రోడ్డు నిర్మించి, భవిష్యత్తులో గుంతలు పడకుండా చూడాలని అధికారులతో మాట్లాడి పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.