నందనంపాటి రాము సేవలను మర్చిపోలేం
కుషాయిగూడ, మార్చి ౧౬ (విజయక్రాంతి): సమాజంలోని పేదలు, భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా భావాన్ని చాటుతున్న ఈసీఐఎల్‌లోని సోలిస్ ఐ కేర్ సీఎండీ, తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ నందనంపాటి రాము నిజమైన సేవా స్ఫూర్తి ప్రదాత అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి అభినందించారు.
సోమవారం ఈసీఐఎల్లోని సోలిస్ ఐ కేర్ హాస్పిటల్లో అన్నదాన సేవా చక్రవర్తి అవార్డు అందుకున్న నందనంపాటి రాము అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నందనంపాటి రాము సమాజంలో సేవా కార్యక్రమాలకు ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాప్రా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, సోలీస్ ఐ కేర్ సిబ్బంది విజయేందర్ రెడ్డి, మహేష్, విజయలక్ష్మి, భాస్కర్, గజేందర్, మోహన్, నీరజ తదితరులు పాల్గొన్నారు.




