17 March, 2026 | 5:16 AM

ఆగి ఉన్న కారుపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఇద్దరి మృతి

17-03-2026 02:36 AM

శామీర్‌పేట్, మార్చి 16 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు మీద కారు ఆపి భోజనం చేస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. శామీర్ పేట్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ (51), షేక్పేట్కు చెందిన మొహమ్మద్ హుస్సేన్ (48) టిఎస్ 09 ఈడి 3303 నంబర్ గల ఆడి కారులో ఈసీఐఎల్  నుండి తూప్రాన్ వైపు ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణిస్తున్నారు.

మార్గ మధ్యలో శామీర్‌పేట్ పరిదిలోకి రాగానే వాహనం రోడ్ పక్కన నిలిపి భోజనం చేస్తుండగా మధ్యం సేవించిన లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి భోజనం చేస్తున్న వారిని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే వృత్తి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే షామీర్పేట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు వెల్లడించారు.