17 March, 2026 | 3:48 AM

ఎస్సెస్సీ స్పాట్ రేట్లు 50% పెంచాలి

17-03-2026 02:34 AM

ముషీరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేట్ల ను 50 శాతం పెంచాలని, గత ఏడాది మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ బకాయిలను విడుదల చేయాలని టీఎస్ యూటిఎఫ్ డిమాండ్ చేసింది.

ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు రెండు సార్లు పెంచారని, పదో తరగతి మూల్యాంకనం రేట్లను కూడా ఆమేరకు సవరించాల్సిన అవసరం ఉందని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పీవీ శ్రీహరిని కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు.